హింసాత్మకంగా మరాఠాల రిజర్వేషన్ల ఆందోళన

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరాఠాలు కొనసాగిస్తున్న ఉద్యమం పుణేలో హింసాత్మకంగా మారింది. పుణే రూరల్ జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు బస్సులు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. టైర్లు కాల్చి రోడ్లపై వేశారు. ఉద్యమకారులు రోడ్లపైనే బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పుణే రూరల్ జిల్లాలోని చకన్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అడిషనల్ పోలీస్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఈ రోజే చార్జి తీసుకొన్న సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ కూడా చకన్ ఏరియాకు చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ…నాందేడ్ లో ఓ యువకుడు సూసైడ్ చేసుకోగా, ఔరంగాబాద్ లో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మరాఠాల రిజర్వేషన్ల అంశంలో జోక్యం చేసుకోవాలని తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత… మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావ్ కి లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ.మరాఠా కమ్యూనిటీకి 16శాతం రిజ్వేషన్లు కల్సించే అంశాన్ని ప్రభుత్వం వేగవంతం చేయాలని కాంగ్రెస్ కోరింది.

Posted in Uncategorized

Latest Updates