హింసాత్మకంగా మారిన భారత్ బంద్…. నలుగురు మృతి

HIMSASC, ST యాక్ట్ లో చట్టసరవణ చేస్తూ సుప్రీం ఇచ్చిన రూలింగ్ ను వ్యతిరేకిస్తూ ఈ రోజు(ఏప్రిల్2) దళిత సంఘూలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ బంద్ హింసాత్మకంగా మారింది. మధ్యప్రదేశ్ లో ఒంద్ లో పాల్గొన్న నలుగురు నిరసనకారులు చనిపోయారు. గ్వాలియర్ లో రెండు గ్రూప్ ల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు చనిపోగా.. బింద్ లో ఒకరు, మోరెనాలో ఒకరు చనిపోయారు. మరోవైపు ఆందోళనలతో ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే కూడా పూర్తిగా బ్లాక్ అయింది. రాజస్ధాన్ లోని బర్మర్ సిటీలో పోలీసులకు, దళితులకు మధ్య జరిగిన గొడవ జరకగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో కార్ల అద్దాలను పగులగొట్టి… కొన్ని ప్రాంతాలలో కార్లను తగులబెట్టారు ఆందోళనకారులు. అజంఘర్ లో ఓ బస్సుని తగలబెట్టారు ఆందోళనకారులు. పలుచోట్ల రైళ్ల రాకపోకలను అడ్డకున్నారు.

Posted in Uncategorized

Latest Updates