హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ వనీ హతం

ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం (అక్టోబర్-11) భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్‌  27  ఏళ్ళ మనాన్ బహీర్ వనీ తో పాటు అతని అనుచరుడు హతమయ్యాడు. వనీ PhDని మధ్యలో మానేసి మిలిటెన్సీ బాటపట్టాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మరో ఉగ్రవాదిని ఆషిక్‌ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన ఉగ్రవాదులకు గౌరవసూచకంగా ఇవాళ (శుక్రవారం) బంద్‌ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు.

Posted in Uncategorized

Latest Updates