హిమదాస్ పై బయోపిక్ తీస్తా : అక్షయ్

అంతర్జాతీయ అథ్లెటిక్‌ ఈవెంట్‌ లో సత్తా చాటి.. భారత్‌ తరఫున తొలి గోల్డ్‌ మెడల్‌ సాధించిన హిమదాస్ కు అరుదైన గుర్తింపు దక్కనుంది. భారతీయ క్రీడారంగంలో సంచలనం సృస్టించిన 18 ఏళ్ల వయసు హిమదాస్ పై బయోపిక్ రానుంది. నిర్మాతగా ఆమె జీవితచరిత్రను తెరకెక్కించడానికి ఇష్టపడతానని తెలిపాడు బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్ కుమార్. 2018 ఆసియా గేమ్స్‌ కోసం సిద్ధమవుతున్న భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈడెల్‌ వీస్‌ గ్రూప్‌ శనివారం (జూలై-28) ఓ కార్యక్రమం నిర్వహించింది. హాకీ ఆధారంగా తెరకెక్కిన తన గోల్డ్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఈ కార్యక్రమంలో అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు నిర్మాతగా ఏ భారతీయ క్రీడాకారుడిపై సినిమా తీసేందుకు ఇష్టపడతారని అక్షయ్‌ని అడుగ్గా.. హిమదాస్‌ పై బయోపిక్‌ తీసేందుకు నేను ఇష్టపడతాను. ఆమె ట్రాక్‌ రన్నర్‌. భారత్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి.. పరుగు పోటీల్లో స్వర్ణపతకం సాధించడమనేది చాలా అరుదైన ఘనత. ఇది నిజంగా అసాధారణమైన విషయం అని ఆయన అన్నారు.

దీంతో ఓ పేద క్రీడాకారిని గుర్తించినందుకు సోషల్ మీడియాలో అక్షయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నీరు నెటిజన్లు. దేశానికి గోల్డ్ సాధించిన హిమదాస్ ను ప్రభుత్వాలు, కంపెనీలు పట్టించుకోనప్పటికీ, సినిమా రంగం అయినా గుర్తించిందని కామెంట్స్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates