హిమాచల్, రాజస్ధాన్ లో భారీ వర్షాలు…పొంగిపొర్లుతున్న ఉల్ నది

ipహిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండి జిల్లాలో కరుస్తున్న అతి భారీ వర్షాలకు ఉల్ నది ప్రమాదకర స్థాయిని దాటి పొంగిపొర్లుతోంది. షానన్ పవర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఉదృతంగా వస్తున్న నీరు… లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతోంది. కొన్ని చోట్ల రాకపోకలు ఆగిపోయాయి. వర్షాలు కొనసాగుతుండడంతో పైనుంచి ఉల్ నదిలోకి వరదనీరు చేరుతోంది. షానన్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో కంటిన్యూ అవుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజస్థాన్ లోనూ వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. శివ్నా, జఖమ్ నదులు డేంజర్ లెవెల్ ను దాటి ప్రవహిస్తున్నాయి. ప్రతాప్ గడ్ జిల్లాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. బ్రిడ్జ్ లపై నుంచి నీరు పొంగుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates