హీరోగా తరుణ్‌ భాస్కర్..నిర్మాతగా విజయ్

తరుణ్‌ భాస్కర్, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమా బాక్సాపీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. తక్కువ బడ్జెత్‌తో చిన్న సినిమాగా తెరకెక్కి విక్టరీని సాధించింది. ఈ సినిమా తర్వాత విజయ్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీని  తెరకెక్కించాడు తరుణ్‌ భాస్కర్. చాలా రోజుల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రాన్ పై కనిపించేందుకు రెడీ అయ్యేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే కొత్త సినిమాతో తరుణ్ భాస్కర్  డైరెక్టర్ గా కాకుండా … హీరోగా మారునున్నాడనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

విజయ్‌దేవరకొండ ఇటీవలే ‘నోటా’ సినిమాలో కింగ్ ఆఫ్ ద హిల్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించాడు. విజయ్ తన నిర్మాణ సంస్థ నుంచే తరుణ్‌ భాస్కర్‌ను హీరోగా లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

Posted in Uncategorized

Latest Updates