హీరోయిన్ కారు ఢీకొనడంతో..వ్యక్తి మృతి

గోవా : బాలీవుడ్ నటి జరీన్‌ ఖాన్‌ కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గోవాలో జరిగింది. ఇవాళ డిసెంబర్-13న ఉదయం ఈ జరీన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడంతో ఓ యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. బైక్‌ పై వెళుతున్న వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోకపోవటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన జరీన్‌.. ఆ యువకుడిని హస్పిటల్ లో చేర్పించినా.. ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.

జరీన్‌ కారు డ్రైవర్‌పై యాక్సిడెంట్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్ హీరోగా 2010లో తెరకెక్కిన ‘వీర్’ సినిమాతో జరీన్ ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యింది. హిందీతో పాటు తమిళ, పంజాబీ చిత్రాలతో హీరోయిన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జరీన్.. ఈ ఏడాది మొదట్లో విక్రమ్‌ భట్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన 1921 సినిమాలో నటించింది.

Posted in Uncategorized

Latest Updates