హీరో పంచ్ డైలాగ్ : నాది రూ.వెయ్యి కోట్ల ఆస్తి.. ఎంజాయ్ చేస్తా

Simbuకోలీవుడ్ హీరో శింబు ఏం చేసినా అది తమిళనాల సంచలనమే. ఇటీవల ఆయన షూటింగ్ సమయంలో నిర్లక్ష్యంగా ఉంటాడని సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేశాయి. దీనిపై శింబు స్పందించాడు. తనకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులున్నాయని, చచ్చేంతవరకు ఇష్టం వచ్చినట్లు బతకగలనన్నాడు.

తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కాదని తన డబ్బేనని చెప్పాడు. దీంతో జీవితాంతం ఎంజాయ్ గా గడుపగలనని.. సినిమాలు తన ఫ్యాన్స్ కోసమే తీస్తున్నాను తప్పా..స్వార్ధపరుడ్ని అనిపించుకోవాలనే ఉద్దేశం తనకు లేదన్నాడు. సినిమా అంటే ఇష్టం కావడంతోనే ఈ రంగంలో కొనసాగుతున్నట్లు చెప్పాడు.  తన తొలి సినిమా చేసినప్పుడు కూడా  నాన్నతో కలిసి 10 గంటలకు సెట్‌కు వెళ్లానని.. అది తన నిర్లక్ష్యం కాదన్నాడు. తాను ఎప్పుడూ ఇలాగే జీవిస్తున్నానని. చాలా కంఫర్టబుల్‌గా బతికానని తెలిపిన శింబు.. రోబోలా జీవించటం తన వల్ల కాదన్నాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా వ్యక్తిగతంగా నేను జీవితంలో సెటిల్‌ అయ్యానని చెప్పాడు. తన పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే,  ప్రవర్తన మార్చుకుంటానని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని ట్విట్ చేశాడు హీరో శింబు.

Posted in Uncategorized

Latest Updates