హీరో విశాల్ అరెస్ట్

చెన్నై : తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో వివాదం మరింత ముదిరింది. టీ నగర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ దగ్గర నిన్నటి నుంచి హైడ్రామా కొనసాగుతోంది. హీరో విశాల్ కు వ్యతిరేకంగా కొందరు ప్రొడ్యూసర్లు ఆందోళన చేశారు.

2015లో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇచ్చిన హామీలను విశాల్ నెరవేర్చడం లేదని, నిధుల వాడకంపైనా అనుమానాలున్నాయని కొందరు నిర్మాతలు రోడ్డెక్కారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి విశాల్  రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫీస్ కు ఓ వర్గం నిర్మాతలు తాళం వేశారు. అయితే తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు విశాల్ ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. విశాల్ ను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్‌ విషయంపై ట్విటర్‌లో స్పందించాడు విశాల్. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నిన్న తమిళ నిర్మాతల మండలికి తాళం వేశారు. అప్పుడు స్పందించని పోలీసులు.. ఇవాళ మా తప్పేం లేకపోయినప్పటికి నన్ను, నా సహచరులను అరెస్ట్‌ చేశారు. దీన్ని నమ్మలేకపోతున్నాను. ఈ విషయం గురించి పోరాటం చేస్తాను అని ట్వీట్‌ చేశాడు.

Posted in Uncategorized

Latest Updates