హుందాగా వ్యవహరించారు : కేసీఆర్ పై ప్రశంశలు కురిపించిన మోడీ

రాష్ట్ర విభజన విషయంలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ ఒత్తిడి చేసినప్పుడల్లా కేసీఆర్ పరిణతితో వ్యవహరించారన్నారు. చంద్రబాబు… వైసీపీ ఉచ్చులో పడ్డారన్న మోడీ.. ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించిందన్నారు. తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చేలా విభజించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న విషయాన్ని అప్పుడూ చెప్పాను, ఇప్పుడూ చెప్తున్నానన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభివృద్దిలో లోటు రానివ్వమని మోడీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates