హెచ్ -1బీ వీసాలపై US మరింత కఠినం : అనుమతివ్వకపోతే వెంటనే వెనక్కి

హెచ్ -1బీ వీసాలపై అమెరికా పౌర, వలస సేవల విభాగం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ట్రంప్ సర్కార్ తెచ్చిన కొత్త పాలసీ ప్రకారం వీసాల ఆమోదానికి, హెచ్ -1బీ వీసా పొడిగింపు కోసం చేసుకున్న దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తిరస్కరించే అధికారం ఉంది. USIS అధికారులకు అప్లికేషన్ బాగుంది అనుకుంటేనే ఆమోదిస్తున్నారు. లేదంటే కనీసం ఎందుకు దరఖాస్తు తిరస్కరించారో కూడా చెప్పాల్సిన పనిలేదు.

H1B వీసాదారులకు సంబంధించిన ట్రంప్ ప్రభుత్వ కొత్త పాలసీ సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వస్తోంది. దీంతో హెచ్ -1బీ వీసాదారులకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు నిపుణులు. మరోవైజు – H1B వీసా పొడిగింపు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరిస్తే… వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఒకవేళ అప్లికెంట్స్ తమ అప్లికేషన్ లో ఎలాంటి పొరపాటు లేదని అనుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఛాన్స్ ఉంటుంది. అయితే…ఈ కొత్త నిబంధనల ప్రభావం భారతీయ ఐటీ ఉద్యోగులు, దేశీయ ఐటీ కంపెనీలపైనే పడే అవకాశాలున్నాయి.

Posted in Uncategorized

Latest Updates