హెటెరో నుంచి HIV మెడిసిన్

hivహ్యూమన్‌ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్‌ (HIV-1) చికిత్సలో ఉపయోగించే ఎమిట్రిసిటాబైన్‌ (200 MG) అండ్‌ టెనోఫోవిర్‌ అలాఫెనామైడ్‌(25 MG)కు జనరిక్‌ యాంటీ రెట్రోవైరల్‌ ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ను విడుదల చేసినట్లు ఔషధాల తయారీ సంస్థ హెటెరో ప్రకటించింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి పొందిన ఈ ఉత్పత్తిని టాఫెరో-ఈం బ్రాండ్‌నేమ్‌తో భారత మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపింది హెటెరో. 12ఏళ్లకు పైబడిన పిల్లలు, పెద్దలకు HIV చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఇది గిలీడ్‌ ఫార్మాకు చెందిన డెస్కోవీ ఔషధానికి జనరిక్‌ వెర్షన్‌ అని వెల్లడించింది హెటెరో.

Posted in Uncategorized

Latest Updates