హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతుండగా ఢీ కొట్టిన రైలు

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్లో దారుణం జరిగింది. చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని రైల్వే ట్రాక్ పై నిలబడి ఫోన్  మాట్లాడుతున్న ఓ వ్యక్తిని  రైలు ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలో రైల్వే ట్రాక్ పై జరిగింది. రాయికల్ బురుజు గడ్డ తండాకు చెందిన మూడవత్ రాంసింగ్ అనే వ్యక్తి డబల్ లైన్ రైల్వే ట్రాక్ పై నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. పాత రైల్వే ట్రాక్ పై రైలు వస్తుందనుకుని  కొత్త రైల్వే ట్రాక్ పై నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. చెవిలో హెడ్ ఫోన్స్ ఉండడంతో రైలు సౌండ్ వినపడలేదు. దీంతో రైలు రాంసింగ్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చెరువులోకి బోల్తా కొట్టిన కారు.. కారులో నుండి సురక్షితంగా బయటపడిన ఎస్.ఐ

గడ్డి పరకే కదా అనుకోలేదు.. దాంతోనే అద్భుతాలు చేస్తూ లక్షల సంపాదన

Latest Updates