హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండింగ్‌: 13 మంది మృతి

mexiccoభూకంపం వచ్చిన ప్రాంతంలో పర్యటించేందుకు మెక్సికో హోంమంత్రి హెలికాప్టర్‌లో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు. శుక్రవారం మెక్సికో హోం మంత్రి అల్ఫోన్సో నవరెట్, ఓక్సాక స్టేట్‌ గవర్నర్‌ అలెజాండ్రో మురాత్‌లు సైనిక హెలికాప్టర్‌లో వెళ్తుండగా దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

దీంతో హెలికాప్టర్‌ దిగిన ప్రాంతంలో ఉన్న 12 మంది అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మంత్రి, గవర్నర్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates