హెల్త్ జాగ్రత్త : సృహ కోల్పోయిన ఎయిర్ మెన్ ను పరామర్శించిన మోడీ

MODI2మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా ముందుకెళ్తోందన్నారు సీషెల్స్ అధ్యక్షుడు డాన్నీ ఫౌరీ. రక్షణ, అంతర్గత భద్రత, వాణిజ్య రంగాల్లో భారత్ అద్భుతంగా పనిచేస్తోందన్నారు. దేశ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రెండుదేశాల అధికారులు పాల్గొన్న ఈ భేటీలో.. పలు ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు రాష్ట్రపతిభవన్ లో డాన్నీకి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాలు గౌరవవందనం సమర్పించాయి. అయితే తివ్రిధ దళాలు వందనాలు సమర్పిస్తున్న సమయంలో ఎండ తీవ్రత కారణంగా ఎయిర్ ఫోర్స్ (IAF) గార్డ్ ఒకరు సృహ తప్పి పడిపోయాడు. రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం ముగిసిన తర్వాత స్వయంగా ఎయిర్ మెన్ దగ్గరకు వెళ్లి అతడ్ని పరామర్శించారు మోడీ. ఆరోగ్యంగా పట్ల జాగ్రత్తగా ఉండాలని అతడికి మోడీ సూచించారు. అతడి ఆరోగ్యంపై వాకబు చేశారు. అతడితో కొంతసమయం గడిపిన మోడీ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Posted in Uncategorized

Latest Updates