హెల్మెట్ ఉంటేనే పోలీస్ క్వార్టర్స్ లోకి ఎంట్రీ

హెల్మెట్ తప్పని సరి చేస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకోవడంతో పాటు… రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులకు ఫైన్ విధుస్తున్నారు. ప్రమాదాలను అరికట్టాలంటే హెల్మెట్ యూజ్ చేయాలని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఇది సామాన్య ప్రజలకే కాదు పోలీసుకు కూడా వర్తిస్తుంది. దీన్ని చెప్పటమే కాదు ఆచరించి చూపించారు. ఇది ఖమ్మంలో పోలీసు కమిషనరేట్ ఏరియాలో జరిగింది.

ఖమ్మం ఆర్ముడ్ రిజర్వుడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోకి హెల్మెట్ లేకుండా బైక్స్ నడిపే వారు ఎవరిని లోనికి అనుమతించేది లేదంటూ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్ముడ్ రిజర్వుడ్ పోలీస్ అధికారులు నో హెల్మెట్… నో ఎంట్రీ అంటూ…హెడ్ క్వార్టర్స్ లోనికి ప్రవేశించే మెయిన్ గేట్ దగ్గర ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేశారు.

పోలీస్ సిబ్బంది ఖచ్చితంగా హెల్మెట్ ధరించి విధులకు హజరు కావాలని పోలీస్ అధికారులు సూచించారు. హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, హైస్పీడ్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తో ప్రతి ఏడాది ‍అనేక మంది చనిపోతున్నారని ఇటీవల జరిగిన పోలీస్ అధికారుల సమావేశంలో పోలీస్ కమిషనర్ తెలిపారు .

విద్యార్థి దశ నుండే యువతకు ట్రాఫిక్ రూల్స్…రోడ్ సేఫ్టీ పై అవగాహన పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చని పోలీస్ కమిషనర్ సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ఏసీపీ సదానిరంజన్ ఆధ్వర్యంలో ప్రతి రోజు వివిధ స్కూల్స్, కాలేజీల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates