హేళన చేశారట : తన నాయకుడు ఓడిపోయాడని.. చేతివేలు నరుక్కున్నాడు

చిట్యాల : అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభిమాన అభ్యర్థి ఓటమిపాలయ్యాడని చేతివేలిని నరుక్కున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (AIFB ) అభ్యర్థిగా పోటీచేసిన గండ్ర సత్యనారాయణరావు(సత్తెన్న) పరాజయంపాలయ్యాడు. ఓటమి పాలవడాన్ని జీర్ణించుకోలేని చిట్ల మల్లేష్‌ అనే అభిమాని బుధవారం డిసెంబర్-12న ఎడమ చేతి వేలును గొడ్డలితో నరుక్కున్నాడు.  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం భీష్మనగర్‌ కి చెందిన మల్లేష్‌.. సత్తెన్న చిత్రంతో ఉన్న టీ షర్టు వేసుకుని గ్రామంలో తిరుగుతున్నాడు. ఓడిపోయిన నాయకుడి టీ షర్టు వేసుకుని ఎందుకు తిరుగుతున్నావని వేరే పార్టీల వారు ఎగతాలి చేశారు. ఓడినా గెలిచినా తాను సత్తెన్న వీరాభిమానినని, ఆయన కోసం ఏమైనా చేస్తానంటూ గొడ్డలితో ఎడమ చేతి వేలును నరుక్కున్నాడు. వెంటనే గ్రామస్థులు స్థానిక ఆర్‌ఎంపీతో ట్రీట్ మెంట్ చేయించారు.

 

Posted in Uncategorized

Latest Updates