హైకోర్టుకి పరిపూర్ణానంద

అనుమతి లేకుండా సిటీలో కాలు పెట్టవద్దని, తనపై విధించిన 6నెలల నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ శుక్రవారం(జులై-20) హైకోర్టును కోరారు స్వామి పరిపూర్ణానంద.  పరిపూర్ణానంద పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. ఇందులో ప్రతివాదిగా కమీషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్‌ అంజనీ కుమార్‌ ను చేర్చారు. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయనే కారణంతో జూలై 10న పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. మరుసటి రోజు పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు ఏపీలోని కాకినాడ శ్రీపీఠానికి పరిపూర్ణానందను తరలించారు.

శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ యాత్ర చేపడతానని ప్రకటించిన తర్వాత పోలీసులు పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందే కత్తిని కూడా 6 నెలలు నగర బహిష్కరణ చేశారు.

Posted in Uncategorized

Latest Updates