హైకోర్టుకు స‌మ‌ర్పించాకే ఓట‌ర్ల తుది జాబితా ప్రకటన

తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం ప‌డుతుంద‌ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8వ తేదీనే తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉండగా.. ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ పరిణామంపై రావత్ స్పందిస్తూ అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. కొత్త ఓట‌ర్ల జాబితా అక్టోబర్ 12న విడుదల చేసే అవకాశాలున్నాయని ఆయ‌న‌ తెలిపారు. హైకోర్టుకు సమర్పించిన తర్వాతే ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates