హైకోర్టును విభజించండి :రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమైన సీఎం కేసీఆర్

కేంద్రన్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో శుక్రవారం (ఆగస్టు-3) ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. హైకోర్టు విభజన అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో హైకోర్టు విభజనపై స్పష్టత ఉన్నప్పటికీ.. కావాలనే జాప్యం చేస్తున్నట్లు కేంద్రమంత్రి దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు. గతంలో కేంద్రం దృష్టికి హైకోర్టు విభజన అంశం తీసుకొచ్చినా… అవిశ్వాస తీర్మానం సందర్భంగా స్పష్టత ఇవ్వలేదని సీఎం కేసీఆర్.. అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కేంద్రం హైకోర్టు విభజనపై జోక్యం చేసుకోవాలని  సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. అలాగే కొత్త జోనల్ విధానాన్ని న్యాయశాఖమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates