హైకోర్టు ఆదేశాలు : ACB వలలో సెషన్స్ కోర్టు జడ్జి

ACB ACB కేసులో మరో జడ్జి చిక్కుకున్నారు. అవినీతి ఫిర్యాదులతో ఇప్పటికే ఇద్దరు జడ్జీలపై విచారణకు ఆదేశించిన హైకోర్టు… హైదరాబాద్ ఒకటోవ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ మూర్తిపై ACB దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో శుక్రవారం (ఏప్రిల్-12) అర్ధరాత్రి నుండి రాధాకృష్ణ మూర్తి ఇంట్లో సోదాలు జరుపుతోంది ACB. ఓ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకున్నారనే ఆరోపణలతో జడ్జి రాధాకృష్ణ మూర్తిపై కేసు నమోదు చేసింది ACB.

గతేడాది అమీర్ పేట్ ఎక్సైస్ పోలీసులు అరెస్ట్ చేసిన మారుపాక దత్తు అనే ఎంటెక్ విద్యార్ధితో పాటు, మరో ప్రైవేట్ ఎంప్లాయి అరెస్ట్ కేసులో ..దత్తుకు బెయిల్ ఇచ్చేందుకు ఏడున్నర లక్షల లంచం తీసుకున్నట్లు రాధాకృష్ణమూర్తిపై ఆరోపణలు ఉన్నాయి. 2017 సెప్టెంబర్ లో జరిగిన ఈ కేసులో బెయిల్ డీల్ చేసుకుని మధ్యవర్తి ద్వారా ఏడున్నర లక్షలు లంచం తీసుకుని బెయిల్ ఇచ్చారని లాయర్ శ్రీరంగారావ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశాడు. రాధాకృష్ణ మూర్తి అవినీతిపై విచారణ జపిరించాలని హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో రాధాకృష్ణ మూర్తి అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన నాంపల్లి సెషన్స్ జడ్జి హైకోర్టుకు నివేదిక సమర్చించారు. దీంతో హైదరాబాద్ ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ACBని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. హైకోర్టు అనుమతితో రాధాకృష్ణ మూర్తిపై కేసు నమోదు చేసిన ACB…. అల్వాల్ లోని ఆయన ఇంట్లో గత రాత్రి నుండి సోదాలు జరుపుతోంది. ఈ కేసుతో నెలరోజుల్లో ముగ్గురు న్యాయమూర్తిలపై ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates