హైకోర్టు ఎప్పుడు సిద్ధం చేస్తారు.. ఏపీకి సుప్రీం సూటిప్రశ్న

ఢిల్లీ :  ఉమ్మడి హైకోర్టు విభజనపై ఢిల్లీలోని సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఎప్పుడు సిద్ధం అవుతుందని ఏపీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిసెంబర్ నాటికి ఏపీలో హైకోర్టు భవనం రెడీగా చేస్తామని ఏపీ తరపు లాయర్ నారిమన్ కోర్టుకు తెలిపారు. మూడేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని.. కేంద్ర, తెలంగాణ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. స్పందించిన జస్టిస్ ఏకే సిక్రీ ఆధ్వర్యంలోని ధర్మాసనం… హైకోర్టు భవనం ఎప్పుడు సిద్ధమవుతుందో అఫిడవిట్ రూపంలో రెండు వారాల్లో కోర్టుకు అందజేయాలని ఏపీకి సూచించింది. తర్వాత విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

మరోవైపు.. ఇదే విషయంలో సుప్రీంలో మరో పిటిషన్ వేసింది కేంద్రం. ఇప్పుడున్న భవనంలో కానీ, హైదరాబాద్ లో వేరే భవనాలలో తెలంగాణ, ఏపీలకు ప్రత్యేక హైకోర్టులు ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు కొట్టివేయాలని పిటిషన్ లో కేంద్రం విజ్ఞప్తిచేసింది.

Posted in Uncategorized

Latest Updates