హైకోర్ట్ ఆదేశం : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కు బ్రేక్

pachayathపంచాయతీ ఎన్నికల్లో బీసీ గణాంకాలు తేల్చాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. బీసీల రిజర్వేషన్లు 34శాతం ఖరారు చేయడంపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, బీసీ సంఘాల నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. పంచాయతీ యాక్టులో బీసీ జనాభాను 34శాతంగా పేర్కొని, శాసనసభలో బిల్లులో 37శాతంగా, సమగ్ర సర్వేలో 54శాతంగా చూపడాన్ని తప్పుబట్టింది ధర్మాసనం.

కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో రిజర్వేషన్లపై వాయిస్ వినిపించింది ప్రభుత్వం. ఇప్పటికే వార్డుమెంబర్లు, సర్పంచ్ ల పదవీకాలం పూర్తయ్యిందని, మరో మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పింది. అయితే 2018 బీసీ కమిషన్ రిపోర్టుతో పాటు, బీసీ జనగణనపై క్లారిటీ వచ్చే వరకూ ఎన్నికలు జరపరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.

Posted in Uncategorized

Latest Updates