హైకోర్ట్ తీర్పు ప్రకారమే ఎన్నికలు : పంచాయతీరాజ్ శాఖ

హైకోర్ట్ తీర్పునకు లోబడే ఎన్నికలు జరుపుతామన్నారు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్. మండలాన్ని యూనిట్ గా తీసుకుని కలెక్టర్లు,.. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆర్డీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల డీపీఓలతో శుక్రవారం ఆమె సమీక్ష చేశారు. ఈ నెలాఖరు వరకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపుతామన్నారు పంచాయతీ రాజ్ అధికారులు. మూడు విడతలుగా ఎన్నికలు జరుపుతామని చెప్పారు. జనవరి మొదటివారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.

Posted in Uncategorized

Latest Updates