హైటెక్ సిటీలో కలకలం : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

SOFTWARE-EMPLOYEహైదరాబాద్ మాదాపూర్ లో విషాదం జరిగింది. మిలింగా టవర్స్ పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ పైకి ఒంటరిగా వచ్చిన శ్రావణి… 11వ అంతస్తులోని సైడ్ వాల్ ఎక్కి దూకేందుకు ప్రయత్నించింది. అయితే గోడ ఎత్తుగా ఉండటంతో.. పక్కనే ఉన్న బెంచీ ఎక్కి దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలు అదే బిల్డింగ్ లోని ఉన్న ప్రైమ్ ఎరా సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంది. శ్రావణికి నాలుగు నెలల బిడ్డ ఉంది. డెలివరీ కోసం సెలవుపై వెళ్లిన శ్రావణి.. ఇటీవలే మళ్లీ తిరిగి విధుల్లో జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి కొంచెం డల్ గానే ఉంటున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే శ్రావణి ఆరోగ్యంపై ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో చూపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం .. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి..  మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

శ్రావణి ఆత్మహత్య చేసుకునే విజువల్స్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బిల్డింగ్ చివరి అంతస్తుకి వెళ్లిన యువతి.. ఎలాంటి భయం, బెరకు, వణుకు లేకుండా దూకేయటం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. అదే విధంగా బిల్డింగ్ పైనుంచి కింద పడినప్పుడు కూడా ఒ బొమ్మ పడిత ఎలా ఉంటుందో అలా ఎగిరి పడటం కనిపిస్తోంది. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలే శ్రావణి ఆత్మహత్యకు కారణం అని అంటున్నారు పోలీసులు, కుటుంబ సభ్యులు.

Posted in Uncategorized

Latest Updates