హైటెక్ సిటీ హయ్యస్ట్ శాలరీ : ఆమె నెల జీతం రూ.2.5 కోట్లు

ఆమె సంవత్సర జీతం 30 కోట్లు.. నెలకు 2.5 కోట్లు.. ఈ లెక్కన రోజుకి 8లక్షలు.. రోజుకి ఎనిమిది గంటలు పని అనుకుంటే.. గంటకు లక్ష రూపాయలు జీతంగా తీసుకుంటుంది.. గంటకి లక్ష రూపాయల జీతమా అని నోరెళ్లబెట్టొద్దు.. ఇది లెక్కలు చెబుతున్న నిజం. ఏడాదికి 30 కోట్ల జీతం తీసుకుంటున్న ఆ మహిళా ఉద్యోగి హైదరాబాద్ లోనే ఉంటుందీ.. అవును.. హైటెక్ సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఈ విషయాన్ని వెల్లడించింది ఇన్ కం ట్యాక్స్ అధికారులు. తెలంగాణ, ఏపీ రాష్ట్రంతో కలిపి.. వ్యక్తిగత ఆదాయం కింద అత్యధిక పన్ను కడుతున్న మహిళగా గుర్తింపు పొందింది.

ఏడాదికి ఆమె అందుకుంటున్న 30 కోట్ల జీతం నుంచి.. 30శాతం అంటే అక్షరాల 9 కోట్ల రూపాయలు ఆదాయపన్ను చెల్లించారు. వ్యక్తిగతంగా అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిందీ ఈమే అని తెలంగాణ, ఏపీ ప్రాంతీయ ఆదాయ పన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్పీ చౌదరి వెల్లడించారు. గోప్యత కారణాల వల్ల ఆమె వివరాలు వెల్లడించలేం అని ప్రకటించారు. గత ఏడాది కూడా ఆమే అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచిందని తెలిపారు. గంటకే లక్షల్లో జీతం ఇచ్చే స్థాయిలో హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు కొలువుదీరి ఉండటం అంతర్జాతీయంగా గుర్తింపు రావటమే అంటున్నారు. ఇంత పెద్ద జీతాలు చెల్లిస్తున్న కంపెనీలు మరింత విస్తరణగా.. నైపుణ్యం కలిగి ఉన్న వారిని తీసుకోవటానికి అడుగులు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతింత జీతాలు అందుకునే వారు మరింత మంది పెరిగే అవకాశాలు లేకపోలేదు…

Posted in Uncategorized

Latest Updates