హైడ్రోజన్ సిలెండర్ పేలి రీసెర్చ్ స్కాలర్ మృతి

బెంగళూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IIS) లో విషాదం చోటు చేసుకుంది. ఐఐఎస్ లో ఉన్న ఏరో స్పేస్ ఇంజనీరింగ్ ల్యాబ్ లో హైడ్రోజన్ గ్యాస్ సిలెండర్ పేలడంతో ఓ రీసెర్చ్ స్కాలర్ మృతి చెందగా.. మరో ముగ్గురు స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని సమీపంలోని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన రీసెర్చ్ స్కాలర్ ను మనోజ్ కుమార్(32) గా గుర్తించారు.  అతుల్య, కార్తీక్‌, నరేశ్ అనే ముగ్గురు విద్యార్థులు‌ గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బెంగళూర్ లోని స్టార్టప్ కంపెనీ సూపర్‌ వేవ్‌ టెక్నాలజీకి చెందిన ఈ నలుగురు ఐఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్నారు. ల్యాబ్ లో ప్రయోగం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు పోలీసులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates