హైతీలో భూకంపం: 11మంది మృతి

కరీబియన్‌ దేశమైన హైతీలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.9గా నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 130మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

శనివారం(అక్టోబర్-6) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించింది. ఘటనలో గాయపడ్డ వారికి వైద్య సదుపాయాలు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించామని హైతీ మినిస్టర్స్ కౌన్సిల్‌ సెక్రటరీ రెనాల్డ్‌ లుబెరిస్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సహాయక బృందాలు ఇక్కడి చేరుకున్నాయి. హైతీ ఉత్తరాదిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. పెద్ద ఎత్తున ఆస్థి నష్టం సంభవించింది. గాయపడిన వారికి ఇక్కడే వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates