హైదరాబాద్‌కు మరో ఐటీ దిగ్గజం : కేటీఆర్

adobe-ktrప్రపంచ ఐటీ దిగ్గజం అడోబి తన సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి-19) మంత్రి కేటీఆర్ అడోబి చైర్మన్ శంతను నారాయణ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అడోబి కేంద్రాన్ని నెలకొల్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు శంతను నారాయణ్ సానుకూలంగా స్పందించారు.

అడోబి కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఇస్తున్నామని శంతను నారాయణ్ తెలిపారు. మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్‌ నగరంలో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. నూతన టెక్నాలజీలపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం లభ్యత ఉందన్నారు శంతను. త్వరలోనే అడోబి బ్ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సంస్థ విస్తరణ వంటి వాటిపై సంస్థ ఒక ప్రకటన చేస్తామని మంత్రి కేటీఆర్ కు తెలిపారు. అడోబి నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

అడోబి సంస్థ ఏర్పాటుకు అవసరమైన సహయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు వినూత్న టెక్నాలజీలపై ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అడోబి కేంద్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంతో ఈకో సిస్టమ్‌ లో ఒక కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ యువతకు ఆయా రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు మంత్రి కేటీఆర్

Posted in Uncategorized

Latest Updates