హైదరాబాద్‌లో ‘ద-బాంగ్‌’ ఈవెంట్

salmankhanహైదరాబాద్‌లో వేసవిని కూల్‌ చేసేందుకు బాలీవుడ్‌ స్టార్స్‌ వస్తున్నారు. మే నెలలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హైదరాబాద్‌లో ‘ద -బాంగ్‌’  పేరుతో ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్‌ లూనెట్టీస్‌ సంస్థ ఆధ్వర్యంలో జరుగనుంది. లూనెట్టీస్ సమర్పిస్తోంది. ద-బాంగ్ టూర్ ను సోహాలీ ఖాన్ ఎంటర్‌టైన్‌మెంట్, జేఏ కలిసి ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షీ సిన్హా, జాక్వలిస్‌ ఫెర్నాండెజ్‌, డైసీ షా, ప్రభుదేవ, గురు రంధ్వా ‘ది ద-బాంగ్‌’ టూర్‌లో భాగం కానున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 120 మందికి పైగా డ్యాన్సర్లు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. మే 12 గచ్చిబౌలీలో ఈవెంట్‌ను ప్లాన్‌ చేయనున్నట్లు చీఫ్‌ ఆర్గనైజర్‌ ఫర్హాన్‌ హుస్సేన్‌ తెలిపారు. వీటికి సంబంధించిన ఎంట్రీ పాసులు మేరా ఈవెంట్స్‌ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఔట్లెట్లలో లభిస్తాయని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates