హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం నగరంలోని పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్,బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌, కవాడిగూడ, చిక్కడపల్లి, రాంనగర్‌, బాలానగర్ లో వర్షం పడింది. వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.

మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.

Latest Updates