హైదరాబాద్‌ నగరాన్ని సంరక్షించుకోవాలి : కేసీఆర్‌

kcrభౌగోళికంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు సీఎం కేసీఆర్.  సోమవారం(ఫిబ్రవరి-4) ప్రగతి భవన్‌లో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్యశాఖలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరానికి నలుదిక్కులా 50-60 కి.మీ విస్తీర్ణంలో లక్ష ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందని, ఆ విస్తీర్ణంలో ఫారెస్టు బ్లాక్స్‌ను అభివృద్ధి పరచాలన్నారు. మూసీనది రెండువైపులా రివర్ ఫ్రంట్, హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్ ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులు ఖర్చుచేయాలన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను కేబీఆర్ పార్క్‌లో మాదిరిగా వాక్ వే రూపొందించాని సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలను సందర్శించి అభివృద్ధికి ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు.

సేవ్ హైదరాబాద్ లో భాగంగా ఇవన్నీ జరగాలన్నారు సీఎం కేసీఆర్. పంచాయతీరాజ్ చట్టాన్ని బడ్జెట్ సమావేశాలకు ముందే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. గ్రామ పంచాయతీలకు జనాభా ప్రతిపదికగా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ప్రతీ ఏడాది నిధులిచ్చేందుకు బడ్జెట్‌లో ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామపంచాయతీలకు నేరుగా, ఫైనాన్స్ కమిషన్, రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఆస్థి పన్నుల వసూలు ద్వారా వచ్చే నిధులు సమకూర్చే విధి విధానాలు రూపొందించాలన్నారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏ విధంగా పొందవచ్చో అధ్యయనం చేయాలని ఆదేశించారు. మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates