హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో ఉచిత వైఫై

హైదరాబాద్‌ : ప్రయాణికులకు ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌ మెట్రో. తొలుత మూడు స్టేషన్లలో ప్రారంభించారు. దశలవారీగా మిగతా స్టేషన్లకు సేవలను విస్తరిస్తామంటున్నారు మెట్రో అధికారులు. ప్రస్తుతం మెట్రోరైలు రెండు మార్గాల్లో 46 కి.మీ. దూరం నడుస్తోంది. 40 స్టేషన్లు ఉన్నాయి. తొలుత ప్రయోగాత్మకంగా అమీర్‌పేట, మియాపూర్‌, నాగోల్‌ మూడు స్టేషన్లను వైఫై సేవలకు ఎంచుకున్నారు. ఈ మూడు స్టేషన్టలో ప్రయాణికుల సందడి ఎక్కువగా ఉంటోంది. అమీర్‌పేట ఇంటర్‌ ఛేంజ్‌ లో రానూపోను కలిపి 30 వేలు, మియాపూర్‌, నాగోల్‌ స్టేషన్లలో ఒక్కోదాంట్లో 20వేల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

*మెట్రోరైళ్లు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నడుస్తున్నాయి.

*సాధారణ రోజుల్లో ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వైపు చివరి మెట్రో రాత్రి 11.24 గంటలు, మియాపూర్‌ వైపు ఆఖరి మెట్రో 10.44 గంటలుగా పేర్కొన్నారు.

* అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ నుంచి… ఎల్బీనగర్‌ వైపు రాత్రి 11.05 గంటలు, మియాపూర్‌ వైపు రాత్రి 11.04 గంటలు, నాగోల్‌ వైపు రాత్రి 11.06 గంటలకు చివరి మెట్రో ఉంది.

* ఖైరతాబాద్‌ స్టేషన్‌ నుంచి.. ఎల్‌బీనగర్‌ వైపు చివరి మెట్రో రాత్రి 11.11 గంటలు, మియాపూర్‌ వైపు రాత్రి 10.58 గంటలకు ఉంది.

Posted in Uncategorized

Latest Updates