హైదరాబాద్‌ లో వర్షం..

 హైదరాబాద్ : గువారం రాత్రి హైదరాబాద్ లో వర్షం పడింది. సాయంత్రం ఎనిమిది గంటలకు మొదలైన వర్షం రాత్రంతా పడుతూనే వుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్ల హైదరాబాద్ లో వర్షం పడ్డట్టు వాతావరణ శాఖ చెప్పింది.

గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సికింద్రాబాద్‌, బేగంపేట, సనత్ నగర్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా పడింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుండే చల్లనిగాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం కూడా వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates