హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీ దత్తాత్రేయ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. మహారాజ శ్రీ అగ్రసేన్ 514 వ జయంతి సందర్భంగా ..కాచిగూడలోని మహారాజ విగ్రహానికి నివాళి అర్పించారు అమిత్ షా. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ లో జరిగే సభలో అమిత్‌ షా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ బహిరంగ సభకు హాజరుకానున్నారు అమిత్ షా. అక్కడ అంబేడ్కర్‌ మైదానంలో నిర్వహించే సమరభేరి సభలో ఆయన ప్రసంగించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates