హైదరాబాద్ జూ పార్కులో సింహం మృతి

హైదరాబాద్ : నెహ్రూ జూలాజికల్‌ పార్కులో సింహం అతుల్‌ (18) వృద్ధాప్యంతో పాటు గాయాలకు గురికావడంతో నిన్న (గురువారం) మృతి చెందింది. వృద్ధాప్యంతో బాధపడుతున్న సింహం వారం రోజుల నుంచి జూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. అతుల్‌ను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్‌ పార్కుతో పాటు విశాఖపట్నం, రాజ్‌కోట్, అలీపూర్, కలకత్తా, డబ్ల్యూబీ నేషనల్‌ పార్కు అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం సింహానికి జూపార్కులో పోస్టుమార్టం నిర్వహించారు. అభయారణ్యాల్లో సింహాలు 15 ఏళ్ల వరకే జీవిస్తాయని జూపార్కులో మాత్రం అతుల్‌ 18 ఏళ్లు జీవించిందని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates