హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు.. తెలంగాణలో వర్షసూచన

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడకక్కడా జోరు వానలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో శుక్రవారం రోజంతా ఆకాశం మబ్బులు పట్టే ఉంది. సూర్యుడే కనిపించలేదు. దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేయడంతో… రోడ్లపై దూరంగా ఏమున్నాయో వాహనదారులకు కనిపించని పరిస్తితి ఉంది. గురువారం రాత్రి వర్షం కురవడం, పొగమంచు కమ్మేయడం.. మారిన వాతావరణ పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. చలి బాగా పెరిగింది.

ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షసూచన

ఉత్తర కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలలో 900మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ద్రోణి 9వందల మీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates