హైదరాబాద్ ను ముంచేసిన వర్షం.. అప్రమత్తమైన GHMC

 హైదరాబాద్‌ : సిటీలో బుధవారం(అక్టోబర్-17)న ఉదయం, సాయంత్రం భారీ వర్షం కురవడంతో..అప్రమత్తమయ్యారు GHMC అధికారులు. కమిషనర్‌ దాన కిషోర్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్స్‌ రెస్క్యు బృందాలను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

అత్యవసర  పరిస్థితుల్లో 100కి ఫోన్‌ చేయాలని కోరారు. పలు ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, భేగంపేట, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ, ఖైరతాబాద్‌లో 8.6 సెం.మీల వర్షపాతం నమోదైంది. అసలే బతుకమ్మ పండుగ, దసరా కావడంతో పబ్లిక్ రోడ్లపైకి రావడం..భారీ వర్షంతో ట్రాఫిక్ కిలోమీటర్ల దూరంలో నిలిచింది. పలుచోట్ల రోడ్లు తెగిపోవడం, మ్యానిహోల్స్ నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని క్లీయర్ చేసేపనిలో పడింది GHMC.

Posted in Uncategorized

Latest Updates