హైదరాబాద్ పోలీస్ కొత్త నినాదం : 100 దాటితే.. 108 ఎక్కుతావ్

hyderabad-policeహైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నినాదం తీసుకొచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ లిమిట్ కంట్రోల్ చేస్తూ వచ్చిన ఈ స్లోగన్ పబ్లిక్ కు బాగా కనెక్ట్ అవుతుంది. 100 దాటితే.. 108 ఎక్కుతావ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. వాహనాల స్పీడ్ 100 దాటితే కంట్రోల్ తప్పుతుంది.. యాక్సిడెంట్స్ అవుతున్నాయి.. దీంతో ఓవర్ స్పీడ్ అనర్థానాలను తెలుపుతూ ఈ స్లోగన్ బాగుందంటున్నారు వాహనదారులు. 108 అంటే అంబులెన్స్.. అంటే ఆస్పత్రికి చేరటం ఖాయం అని భయపెడుతున్నారు.

ఒక్క ఓవర్ స్పీడ్ పైనే కాకుండా.. డ్రంక్ అండ్ డ్రైవ్ కు కూడా ఈ స్లోగన్ కనెక్ట్ అవుతుంది. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడుతున్న మందుబాబుల ఆల్కహాల్ శాతం వంద దాటుతుంది. 100 స్పీడ్ దాటితే  వాహనం నడిపేవాడి కంట్రోల్ లో ఉండదు. అప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని 100 దాటితే.. 108 ఎక్కుతావ్ అంటూ స్లోగన్ రిలీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 35 పాయింట్లు దాటిన తర్వాత కేసు బుక్ చేస్తారు. 100 పాయింట్లు అంటే తీవ్రంగా పరిగణిస్తారు. కనీసం మూడు బీర్లు, ఓ హాఫ్ బాటిల్ లిక్కర్ కొడితేనే 100 పాయింట్లు కౌంట్ వస్తుంది. అంటే ఆ స్థాయిలోనే మందుకొట్టి వాహనం నడిపితే యాక్సిడెంట్స్ జరగటం ఖాయం అంటున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ 100 దాటి రోడ్డెక్కితే 108 ఎక్కుతావ్ అని చెప్పటానికి ఈ స్లోగన్ తీసుకొచ్చారు.

Posted in Uncategorized

Latest Updates