హైదరాబాద్ ఫెస్ట్ : పిల్లల సైన్స్ ఫెయిర్, బుక్స్ స్టాల్స్ తో సందడి

book-festసాహిత్య, సాంస్కృతిక మహోత్సవానికి మరోసారి వేదికైంది సిటీ. హైదరాబాద్‌ ఫెస్ట్‌ పేరుతో మొదటిసారి చేపడుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ ఎన్టీఆర్‌ స్టేడియంలో పిల్లల కోసం జానపద కళారూపాలు, సాహిత్య సభలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, ఆటపాటలు, వినోదభరిత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పిల్లల వినోదానికి సంబంధించి ఈ ఫెస్ట్ లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సైన్స్ ఫెయిర్ తోపాటు.. పిల్లల పుస్తకాలన్నీ ఒకేచోట లభించనున్నాయి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల ఆటపాటలు, వినోదానికి ఎంతో ఉపయోగంగా ఉండనుంది ఈ ఫెస్ట్.

ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు, శని, ఆదివారాల్లో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితం. 15 వేదికలపై ప్రతిరోజు 25 కార్యక్రమాల చొప్పున 10 రోజుల్లో 250 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్‌ను అందరూ విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్‌ ఫెస్ట్‌ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఎయిర్‌ బెలూన్‌ను ఆవిష్కరించారు.

Posted in Uncategorized

Latest Updates