హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. పరారీలో నైజీరియన్

రంగారెడ్డి: రాజేంద్రనగర్ మండలంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఓ నైజీరియన్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. సన్ సిటీ ఏరియాలో నైజీరియా దేశస్తుడు మత్తుపదార్థాలు అమ్మేందుకు ప్రయత్నించాడు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రోజున అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వస్తున్నారని తెలిసి… నైజీరియన్ పరుగు పెట్టాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని వెంబడించారు.

నైజీరియన్ పారిపోతుండగా ఓ కానిస్టేబుల్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. నైజీరియన్ దాడి చేయడంతో కానిస్టేబుల్ కిందపడిపోయాడు. అక్కడినుంచి ఓ బైక్ పై పారిపోయాడు దుండగుడు. పోలీసులకు దొరక్కుండా అతి వేగంగా పారిపోతుండగా.. ఓ మహిళను బైక్ తో ఢీకొట్టాడు నైజీరియన్. ఈ యాక్సిడెంట్ లో ఓ మహిళ, ఓచిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ చేసి కూడా అదే వేగంతో పారిపోయాడు దుండగుడు. అతడి కోసం.. పదిహేను మంది టాస్క్ ఫోర్స్ పోలీసుల టీమ్ హైదరాబాద్ చుట్టుపక్కల గాలిస్తోంది. సంబంధీకులపై ఆరా తీస్తోంది.

Posted in Uncategorized

Latest Updates