హైదరాబాద్ మారథాన్ కు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ మారథాన్. 11 వందల మందితో మొదలైన 42 కిలో మీటర్ల పరుగు పందెం.. ప్రస్తుతం 24వేల మందికి చేరింది. హెల్తీ హైదరాబాద్ ట్యాగ్ లైన్ జోడిస్తూ.. ప్రభుత్వ పథకాలను కూడా జనంలోకి చేరవేస్తోంది. ఛారిటీ ఈవెంట్లతో పేద విద్యార్థులకు చేయూతనిస్తోంది. రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ పై స్పెషల్ స్టోరీ. మారథాన్ ఈ పేరు వింటే చాలు. హైదరాబాదీల్లో ఏదో తెలియని ఉత్సాహం. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ పేరు దేశ, విదేశాల్లోను మార్మోగుతోంది. భారత్ లో ముంబై మారథాన్ అంటే తెలియని వారుండరు. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్ ఇది. దీని తర్వాత పాపులర్ పొందుతున్న ఈవెంట్ హైదరాబాద్ మారథాన్. 2011లో 11 వందల మందితో ప్రారంభమైన ఈ రేస్…ప్రస్తుతం 24 వేల మందికి చేరుకుంది.

ఈ మెగా ఈవెంట్ లో 42.2కిలో మీటర్ల ఫుల్ మారథాన్, 21.1 కిలో మీటర్ల ఆఫ్ మారథాన్ నిర్వహిస్తారు. 10K రన్ తో పాటు.. మారథాన్ ముందురోజు చిన్నారులు, ఔత్సాహుల కోసం ఐదు కిలో మీటర్ల ఫన్ రన్ ని కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎనిమిదో ఎడిషన్ ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ ఆగస్టు 25, 26 తేదీల్లో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే 22 వేల మందికిపైగా రిజిష్ట్రేషన్స్ చేసుకున్నట్లు ఆర్గనైజర్స్ చెప్పారు. 25న హైటెక్స్ గ్రౌండ్ లో 5కె రన్ జరుగుతుండగా.. 26న 10కె రన్, నెక్లస్ రోడ్ లో ఆఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ ప్రారంభం అవుతాయి. మారథాన్ కు ఎనిమిది నెలల ముందు నుంచే కసరత్తు మొదలు పెడతామంటున్నారు ఆర్గనైజర్స్. ప్రోగ్రామ్ విజయవంతానికి 3 వేల మంది వరకు వాలంటీర్లు అవసరమంటున్నారు. ఇందుకోసం సిటీలోని వివిధ కాలేజ్ స్టూడెంట్స్ సాయం తీసుకుంటారు. ఇందులో పాల్గొన్నవారికి మెడల్స్ తో పాటు విన్నర్స్ కి లక్షల్లో ప్రైజ్ మనీ ఇస్తామంటున్నారు నిర్వాహకులు. మారథాన్ తో వచ్చిన డబ్బుని పేద విద్యార్థుల చదువుతో పాటు వివిధ స్వచ్చంద సంస్థలకు చేయూతనందిస్తున్నారు.

మారథాన్ లో పాల్గొనేవారికి మెడికల్ సేఫ్టీ కూడా ఏర్పాటు చేస్తారు. GHMC, పోలీస్, ప్రైవేట్ హాస్పిటల్స్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మారథాన్ ని ఏటా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మారథాన్ జరిగే దారి పొడవునా మెడికల్ క్యాంప్ లతో పాటు రన్నర్స్ కి ఎంటర్ టైన్ మెంట్ కోసం డీ.జె. సౌండ్స్, పోలీస్ డ్రమ్ బ్యాండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం జుంబా సెషన్ కూడా నిర్వహిస్తారు. ఒకవైపు సెలబ్రేటీస్ సందడి.. మరోవైపు హైదరాబాదీల ఉత్సాహంతో హైదరాబాద్ మారథాన్ ఫుల్ జోష్ గా మారుతుంది.

Posted in Uncategorized

Latest Updates