హైదరాబాద్ లో అమిత్ షా: పార్టీ పరిస్థితిపై ఆరా

ఒక్కరోజు పర్యటన కోసం హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బిజీగా గడుపుతున్నారు. పార్టీ కార్యాలయంలో ఫుల్ టైమర్స్ తో సమావేశమైన  అమిత్ షా…కమిటీల వారిగా పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత కోసం బూత్ కమిటీ పరిధిలో స్థానిక నాయకులు చేస్తున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. తర్వాత పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అమిత్ షాకు వివరించారు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు.

అంతకు ముందు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నఆయనకు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు షా, అదే వేదిక మీద షాకు తలపాగా పెట్టి రాష్ట్ర పార్టీ తరఫున సత్కరించారు నేతలు. అయితే ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారని అనుకున్నా కామ్ గా వెళ్లిపోవడంతో పార్టీ నేతలు నిరాశపడ్డారు.

హైదరాబాద్ టూర్ లోనే సమర్థాన్ క్యాంప్ లో భాగంగా పలువురు ప్రముఖులను కలుస్తారు అమిత్ షా. సాయంత్రం ఈనాడు అధినేత రామోజీరావు,  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్,  పారిశ్రామికవేత్త శ్రీనిరాజును కలువనున్నారు.

Posted in Uncategorized

Latest Updates