హైదరాబాద్ లో ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన సందడి ఇంకా కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌ నుంచి అబిడ్స్‌ వరకు వినాయక విగ్రహాలు బారులు తీరాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిన్న( ఆదివారం) వేలాది సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాయి. ముందుగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత మిగిలిన విగ్రహాల నిమజ్జనాలు జోరందుకున్నాయి. నిన్నటి నుంచి దాదాపు 80 శాతం గణనాథుల నిమజ్జనం పూర్తయ్యిందని.. ఇవాళ మధ్యాహ్నం వరకు మితగా 20 శాతం పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చారు.

Posted in Uncategorized

Latest Updates