హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి…ట్రాఫిక్ ఆంక్షలు


హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి (అక్టోబర్ -2) 8వ తేదీ వరకు ఉపరాష్ట్రపతి వెంక య్యనాయుడు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఆయన పర్యటన సందర్భంగా నిర్ణీత సమయాలలో ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు ఉపరాష్ట్రపతి పర్యటన సమయంలో ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు:

…2వ(మంగళవారం) తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 3.20 గంటల వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బంజారాహిల్స్, రోడ్డు నెంబర్ 12లోని ఆయన నివాసం వరకు.
…3వ ఉదయం 8.45 నుంచి 9.35 వరకు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఖైరతాబాద్, విశ్వేశ్వరయ్య భవన్ వరకు. తిరిగి ఉదయం 10.15 గంటల నుంచి 11.05 వరకు ఖైతరాబాద్ నుంచి బంజారాహిల్స్, సాయంత్రం 4.15 నుంచి 5.05 నిమిషాల మధ్య బంజారాహిల్స్ నుంచి శిల్పకళావేదిక, సాయంత్రం 5.45 నుంచి 6.35 వరకు శిల్పా కళావేదిక నుంచి బంజారాహిల్స్ వరకు ఆంక్షలు ఉంటాయి.
…4వ తేదీ ఉదయం 9.20 నుంచి 10.05 వరకు బంజారాహిల్స్ నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ వరకు, ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోఠి నుంచి బంజారాహిల్స్ వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
…7వ తేదీ ఉ 7.15 నిమిషాల నుంచి 8. 30 గంటల మధ్యలో బంజారాహిల్స్ నుంచి శంషాబాద్, ముంచింతల్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.

Posted in Uncategorized

Latest Updates