హైదరాబాద్ లో కార్డన్ సర్చ్..37 మంది అరెస్ట్

DCPSUMATHIIPSహైదరాబాద్ నార్త్ జోన్ బోయిన్ పల్లి పీఎస్ పరిధిలోని బస్తీల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. నార్త్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి  ( ఫిబ్రవరి-5) 450 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. తనిఖీల్లో 37 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. ఓల్డ్ బోయిన్ పల్లి బస్తీల్లో  ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఈ ఏరియాలోని స్థానికులు కోరడంతోనే కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు  డీసీపీ సుమతి.

Posted in Uncategorized

Latest Updates