హైదరాబాద్ లో క్వాల్ కామ్ మెగా క్యాంపస్

ప్రపంచ ఎలక్ర్టానిక్స్ దిగ్గజం క్వాల్ కామ్… మూడు వేల కోట్ల భారీ పెట్టుబడితో  హైదరాబాద్ లో మెగా క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నగరంలోని కోకాపేటలో ఈ క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఇవాళ(అక్టోబర్ 6)న ప్రకటించింది. కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్ శశిరెడ్డి బృందం.. ఇవాళ రాష్ర్ట ఐటి మినిస్టర్ కేటీఆర్ ను కలిసి క్యాంపస్  వివరాలను తెలిపారు.

నగరంలో తమ సంస్థ తరఫున ఇప్పటికే నాలుగు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని.. ఈ    క్యాంపస్ ఏర్పాటుతో సుమారు 10వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. హైదరబాద్ లో ఏర్పాటు చేసే ఈ సెంటర్.. అమెరికాలోని శాన్ డియాగోలో ఉన్న క్వాల్ కామ్ సెంట్రల్ ఆఫీస్ తర్వాత రెండో అతిపెద్దదని సంస్థ తెలిపింది. మెగా క్యాంపస్ లో ఏర్పాటు చేసే డెవలప్ మెంట్ సెంటర్ లో   5జి మొబైల్ టెక్నాలజీ పై రీసెర్చ్,టెస్టింగ్ చేయనున్నారు.

Posted in Uncategorized

Latest Updates