హైదరాబాద్ లో గాలి దుమారం..వడగళ్ల వాన

rainహైదరాబాద్ లో పలుచోట్ల శుక్రవారం (ఏప్రిల్-6) రాత్రి భారీ వర్షం కురిసింది.   రాత్రి 8 గంటలకు ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం దాదాపు 45 నిమిషాలపాటు దంచికొట్టింది. భారీ గాలులతోపాటు వడగండ్లు కూడా పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ కాలువల్లా మారాయి. నాలాలు పొంగిపొర్లాయి. 100 కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన ఈదురుగాలులకు రోడ్లమీద చెట్లు  విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ్నే నిలిచిపోయింది.

ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నాగోలు, పంజాగుట్ట, కాప్రా, అల్వాల్, రామంతపూర్, దిల్ సుఖ్ నగర్, మియాపూర్, మొయినాబాద్, బోయినపల్లి, రాజేంద్రనగర్, గచ్చబౌలిలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. వడగండ్లు పడటంతో జనం ఇబ్బందులుపడ్డారు. ఈదురుగాలులు, వడగండ్లతో చాలాప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. యూసుఫ్ గూడలో పెద్దసైజులో వడగండ్లు పడ్డాయి. భారీ వర్షంతో సిటీలోని చాలాప్రాంతాల్లో కరెంటు సరఫరా బంద్ అయ్యింది. మూడు రోజులుగా సిటీ శివారు ప్రాంతాల్లో సాయంత్రం అవ్వగానే ఈదురుగాలు, వడగళ్ల వర్షం పడుతోంది.

 

Posted in Uncategorized

Latest Updates