హైదరాబాద్ లో గూగుల్ సమ్మర్ క్యాంప్

GPసమ్మర్ విత్ గూగుల్ కాన్సెప్ట్.. పిల్లల్లో కొత్త ఆలోచనలు సృష్టిస్తుందన్నారు గూగుల్ ట్రస్ట్ డైరెక్టర్ సునీత మొహంటి. పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ ఎంతో ముఖ్యమన్నారు. వాళ్లలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతాయన్నారు. సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా పిల్లల కోసం సమ్మర్ క్యాంపు ని నిర్వహించింది.
హైదరాబాద్ లో గూగుల్ సమ్మర్ క్యాంపు నిర్వహించారు. అందులో వంద మంది పిల్లలకి మాత్రమే అవకాశం కల్పించారు. వీళ్ళల్లో 50మంది హైదరాబాద్ పిల్లలని ఎంపిక చేశారు. వీళ్ళంతా హైదరాబాద్ గూగుల్ బ్రాంచ్ లో సమ్మర్ విత్ గూగుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమ్మర్ క్యాంపుని 4 భాగాలు 4 వారాలుగా విడదీశారు. మొదటివారం గూగుల్ ఎర్త్ వాడకానికి సంబంధించిన విషయాలు.. ఆ తర్వాత గూగుల్ ట్రాన్స్ లేట్ , వేరొక భాషలో ఓ కొత్త పదాన్ని నేర్చుకోవడం.. 3వ వారం గూగుల్ ఆర్ట్స్, కల్చర్ కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు.. చివరికి ఛాలెంజ్ గూగుల్ అందించే టూల్స్ వాడుతూ యాప్ ను సృష్టించడం లాంటివి ఉంటాయన్నారు. ప్రతి చిన్నారి సరికొత్త ఆలోచనలతో పైకి ఎదగడమే తమ లక్ష్యమన్నారు గూగుల్ డైరెక్టర్.

ఈ క్యాంపులో పిల్లలు చాలా ఉత్సహంగా పాల్గొన్నారు. కేవలం స్కూల్స్ లో నుంచే కాకుండా వ్యక్తిగతంగా పిల్లలని ఎంపిక చేశారు. అయితే ఈ క్యాంపులో పాల్గొనడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు. అలాగే ఎన్నో కొత్త విషయాలపై అవగాహన పెంచుకున్నామన్నారు పిల్లలు. పిల్లల కోసం గూగుల్ ఇలాంటి ఆలోచనతో ముందుకు రావడం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు తల్లిదండ్రులు. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates