హైదరాబాద్ లో చిమ్మచీకట్లు : నేలకొరిగిన చెట్లు, ట్రాఫిక్ జాం

rain-hydహైదరాబాదీలు షాక్ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉక్కబోత ఎండ, సెగతో అల్లాడిపోయారు ప్రజలు. అప్పటికప్పుడు వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా ఈదురుగాలులు ప్రారంభం అయ్యాయి. దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. మిట్ట మధ్యాన్నం బయట కాలుపెడితేనే కళ్లు బైర్లు కమ్మే ఎండ నుంచి.. అంతా చీకటి అయిపోయింది. అర్ధరాత్రి అయ్యిందా అన్నంతగా మేఘాలు కమ్మేశాయి.

నేలకొరిగిన చెట్లు : ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో గాలి దుమారం. చెట్టుకొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దీనికితోడు భారీ వర్షం. రోడ్లపై నీళ్లు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మిట్టమధ్యాహ్నం చిమ్మచీకట్లు ఉండటంతో.. చాలా మంది వాహనదారులు రోడ్ల పక్కన నిలిపివేశారు. మరికొందరు జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. కొన్ని రహదారుల్లో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోవటంతో.. నిదానంగా సాగుతున్నాయి వాహనాలు.

Posted in Uncategorized

Latest Updates